బుర్రకథ రిలీజ్ డేట్ ఫిక్స్

Tuesday,June 18,2019 - 11:39 by Z_CLU

మార్కెట్లో వరుసగా అన్నీ ఎమోషనల్ మూవీసే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ లో అయితే జెర్సీ, మజిలీ, మహర్షి.. ఇలా అన్నీ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన సినిమాలే. ఇప్పుడీ ట్రెండ్ కు బ్రేక్ వేయబోతోంది బుర్రకథ. ఔట్ అటు ఔట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా  28న థియేటర్లలోకి రాబోతోంది.

ఆది హీరోగా నటించిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకుడు. డైరక్టర్ గా ఈయనకిదే తొలి సినిమా. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆది కెరీర్ లో చేసిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ఇదే. రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు ఈ సినిమాని.

మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, పోసాని కీలక పాత్రలు పోషించారు. సాయికార్తీక్ సంగీతం అందించాడు. సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను వింటేజ్ క్రియేష‌న్స్ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుంది.