మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో సూర్య హంగామా

Thursday,May 03,2018 - 12:53 by Z_CLU

ఓవర్సీస్ లో నా పేరు సూర్య హంగామా షురూ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా యూఎస్ లోని మల్టీప్లెక్సుల్లో బన్నీ కటౌట్లు వెలిశాయి. అక్కడ కూడా బాణసంచా పేలుళ్లతో థియేటర్ల పరిసరాలు మారుమోగిపోతున్నాయి. మరికొన్ని గంటల్లో నా పేరు సూర్య సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్నాయి. రాత్రికి ఫస్ట్ టాక్ బయటకొస్తుంది.

నార్త్-అమెరికాలో ఏకంగా 200 స్క్రీన్స్ పై నా పేరు సూర్య ప్రీమియర్స్ కు ఏర్పాట్లు పూర్తిచేశారు. 2 రోజుల కిందటే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా, నిన్నటికే ప్రీమియర్ షో టిక్కెట్స్ అమ్ముడుపోయాయి. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న బన్నీ, నా పేరు సూర్యతో మరో బ్లాక్ బస్టర్ ఇస్తాడని అంతా ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే నా పేరు సూర్య ప్రమోషనల్ స్టఫ్ ఉంది.

బన్నీ, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషాశ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.