"నా పేరు సూర్య" గోవా షెడ్యూల్ డీటెయిల్స్

Monday,December 11,2017 - 03:03 by Z_CLU

దువ్వాడ జగన్నాథమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న మూవీ నా పేరు సూర్య. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూ ల్ లో హీరో బన్నీ, విలన్ ఠాకూర్ అనూప్ సింగ్ మధ్య ఓ యాక్షన్ బ్లాక్ తీశారు. అలాగే హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్, బన్నీ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా తీశారు.

రేపటితో నా పేరు సూర్య సినిమా షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. షెడ్యూల్ అయిన వెంటనే యూనిట్ అంతా హైదరాబాద్ చేరుకుంటుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని కొత్త షెడ్యూల్ మళ్లీ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. నా ఇల్లు ఇండియా అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్.

రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమాకు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాత. నాగబాబు ఈ మూవీని సమర్పిస్తున్నారు. విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.