ఈ 'సూర్య' వెరీ వెరీ స్పెషల్

Wednesday,May 02,2018 - 08:05 by Z_CLU

బన్నీ సినిమాలు చాలా వచ్చాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే బన్నీ గత సినిమాలతో పోలిస్తే, నా పేరు సూర్య మూవీ వెరీ వెరీ స్పెషల్. ఇంతకీ ఈ సినిమా ఎందుకు ఇంత ప్రత్యేకం. ఈ మూవీని అసలు ఎందుకు చూడాలి. దీనికి సమాధానమే “సూర్య స్పెషాలిటీస్”.

 

 స్పెషాలిటీ 1

‘నా పేరు సూర్య’ సినిమా రిలీజ్ కి ముందు ఇంతలా ఎట్రాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ బన్నీ క్యారెక్టర్. కేవలం ఈ పాత్ర నచ్చి సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఒప్పుకున్నాడంటే.. సూర్య క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 

 స్పెషాలిటీ 2

సూర్య అనే పాత్ర చుట్టూ అల్లిన బలమైన కథ ఇది. మోస్ట్ ఎగ్రెసివ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందనేదే ఈ సినిమా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కన్నా దేశానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఓ సైనికుడి కథ ఇది. సినిమాలో బన్ని క్యారెక్టరైజేషన్ తరవాత, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా స్టోరీలైన్.

 

 స్పెషాలిటీ 3

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు బన్ని. మిలిటరీ మ్యాన్ లా కనిపించడం కోసం ఏకంగా మిలిటరీ  ట్రైనింగ్ తీసుకొని మరీ సెట్స్ పైకి వచ్చాడు. దీనికోసం ఫారిన్ ఫిజికల్ ఫిట్ నెస్ ట్రయినర్ ను ప్రత్యేకంగా హైదరాబాద్ రప్పించుకొని మరీ కసరత్తులు చేశాడు. అలా ఫిజికల్ గా మారడంతో పాటు హెయిర్ స్టైల్ నుంచి మేకప్ వరకు ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. చివరికి సూర్య పాత్ర కోసం తన కనుబొమ్మను కూడా కట్ చేసుకున్నాడు బన్నీ.

 స్పెషాలిటీ 4

క్యారెక్టర్, కథ, మేకోవర్ అన్నీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయినప్పుడు.. ఇలాంటి కథను సెట్ లో షూట్ చేస్తే ఏం బాగుంటుంది. అందుకే రియల్ లొకేషన్స్ కు వెళ్లిపోయింది యూనిట్. మిలట్రీ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి నిజంగానే బోర్డర్ కు వెళ్లిపోయారు. బన్నీతో పాటు యూనిట్ అంతా ప్రాణాలకు తెగించి పాక్ బోర్డర్ లో ఈ సినిమాను షూట్ చేశారు. ఇండియన్ ఆర్మీ వీళ్లకు ఫుల్ సపోర్ట్ అందించింది.

 

స్పెషాలిటీ 5

టాలీవుడ్ లో రిలీజవుతున్న కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఓ వైపు… ఈ సినిమా మరోవైపు. అందుకే మ్యూజిక్ డిఫెరెంట్ గా  ఉండాలి అనే ఆలోచన కన్నా, ఫ్రెష్ గా ఉండాలి అనే రీజన్ తో బాలీవుడ్ కంపోజర్స్ విశాల్–శేఖర్ ని ప్రిఫర్ చేశారు. ఈ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమా ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్ లో ఉండబోతోంది.

స్పెషాలిటీ 6

స్టోరీలైన్.. కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ బన్నీ సినిమా అంటే ఎనర్జిటిక్ స్టెప్స్ ఉండాల్సిందే. నా పేరు సూర్య కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ ఉన్నాయి. మచ్చుకు కొన్ని ట్రయిలర్స్ లో కనిపిస్తున్నాయి. సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ సాంగ్ లో బన్ని క్యాప్ ట్రిక్స్ జస్ట్ ఓ శాంపిల్ మాత్రమే.

స్పెషాలిటీ 7

అల్లు అర్జున్ స్థాయి స్టార్ అంటే భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. ఆ రేంజ్ ఉన్న స్టార్ ఏదైనా కొత్తదనం ట్రై చేయడం వేరు.. ఏకంగా కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడం వేరు. కానీ అల్లు అర్జున్ వక్కంతం వంశీ లాంటి కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు. ఈ సినిమాతో పరిచయం అవుతున్న వక్కంతం వంశీ.. సూర్య క్యారెక్టర్ తో మేజిక్ చేయబోతున్నాడు.

 

స్పెషాలిటీ 8

సినిమాలో ఉండబోయే 4 భారీ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. నిజానికి సినిమాలో హైలెట్ కాబోయే అల్లు అర్జున్ క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయబోయే ఎలిమెంట్ ఇదే. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు హాలీవుడ్ రేంజ్ అనుభూతినివ్వడం గ్యారెంటీ.