హైదరాబాద్ లో బన్నీ సినిమా భారీ క్లైమాక్స్ షూటింగ్

Monday,February 12,2018 - 11:42 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో భారీ షూటింగ్ కు ప్లాన్ చేశారు. ఇందులో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ చేయనున్నారు.

ఈ చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా… ఎల్లుండి ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్… ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు

ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ – రామ్ లక్ష్మణ్
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
సినిమాటోగ్రఫి – రాజీవ్ రవి
సంగీతం – విశాల్ – శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ – డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు
బ్యానర్ – రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ – k.నాగబాబు
సహ నిర్మాత – బన్నీ వాసు
నిర్మాత – శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ