నా పేరు సూర్య సెకెండ్ సింగిల్ అదుర్స్

Wednesday,February 14,2018 - 11:52 by Z_CLU

బన్నీ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య సినిమాకు సంబంధించి దశలవారీగా సాంగ్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీకి సంబందించి సైనిక అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో ఈరోజు సెకెండ్ సింగిల్ రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డే కానుకగా వచ్చిన ఈ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది.

ఫస్ట్ సింగిల్ లో తనలోని దేశభక్తిని చాటిచెప్పిన బన్నీ.. సెకెండ్ సింగిల్ లో తనలోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్కరించాడు. అందుకే ఈ పాటను వాలంటైన్స్ డే సందర్భంగా ఈరోజు విడుదల చేశారు. పాట వినడానికి కొత్తగా ఉంది. దీనికి కారణం బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్-శేఖర్ కంపోజిషన్. వీళ్లలో విశాల్ ఈ పాటను స్వయంగా ఆలపించడం విశేషం.

పాట విన్న వెంటనే క్యాచీగా ఉంది. సాహిత్యంలో ఇంగ్లిష్ పదాలతో పాటు సంగీతంలో వెస్ట్రన్ బీట్ కనిపించింది. ఫస్ట్ సింగిల్ ను రాసిన రామజోగయ్య శాస్త్రే ఈ పాటను కూడా రాశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఏప్రిల్ 26న సినిమా థియేటర్లలోకి రానుంది.