బన్నీ కొత్త సినిమా ప్రారంభం

Wednesday,June 14,2017 - 10:30 by Z_CLU

అల్లు అర్జున్ మరో కొత్త సినిమా ప్రారంభించాడు. ఈ సినిమాతో కథా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీకి నా పేరు సూర్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆఫీస్ లో సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

అల్లు అర్జున్ కు ఇది 18వ సినిమా. తన కెరీర్ లో ఓ కొత్త దర్శకుడ్ని బన్నీ పరిచయం చేయడం ఇది రెండోసారి. గతంలో ఆర్య సినిమాతో సుకుమార్ ను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఇప్పుడు వక్కంతంకు ఆ ఛాన్స్ దక్కింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ఈ మూవీ. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.