అప్పుడు సుకుమార్.. ఇప్పుడు వక్కంతం వంశీ

Thursday,May 03,2018 - 03:01 by Z_CLU

తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు బన్నీ. కానీ నూతన దర్శకుల్ని పరిచయం చేసింది మాత్రం రెండే రెండు సందర్భాల్లో. వాటిలో ఒకటి ఆర్య సినిమా అయితే, ఇంకోటి నా పేరు సూర్య సినిమా. ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే బన్నీ ఇలా ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడు.

అప్పట్లో సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఆర్య సినిమాతో సుకుమార్ నిరూపించుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు వక్కంతం వంశీని నమ్మాడు అల్లు అర్జున్. కొత్త దర్శకుల విషయంలో బన్నీ నమ్మకం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. సో.. నా పేరు సూర్య కూడా సూపర్ హిట్ గ్యారెంటీ అనే పాజిటివ్ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది.

గతంలో సుకుమార్ తో చేసిన ఆర్య సినిమా బన్నీకి ఓ సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. సుకుమార్ ను స్టార్ట్ డైరక్టర్ ను చేసింది. ఇప్పుడు నా పేరు సూర్య సినిమా కూడా స్టయిలిష్ స్టార్ కు మరో కొత్త ఇమేజ్ తీసుకొస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. పనిలో పనిగా వక్కంతం కూడా స్టార్ డైరక్టర్ అయిపోతాడని లెక్కలేస్తున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది నా పేరు సూర్య సినిమా.