సుకుమార్ ప్రాణాలు కాపాడిన బన్నీ

Monday,July 31,2017 - 12:01 by Z_CLU

హైదరాబాద్‌లో దర్శకుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో బన్నీకి సంబంధించిన ఓ విషయాన్ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు సుకుమార్. సుకుమార్ మాట్లాడుతూ “బన్నీ నా వల్లే హీరో అయ్యాడు. ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ పడవ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి నేను నీళ్లలో పడిపోయాను. నాకు ఈత రాకపోవడం వల్ల ఏం చేయాలో అర్థంకాలేదు. ఓ నిమిషం ఆగితే చనిపోయేవాడిని. వెంటనే బన్నీ నీళ్లలో దూకి నన్ను రక్షించాడు. నన్ను రక్షించాడు కాబట్టి బన్నీని రియల్‌హీరోగా భావిస్తాను. నా దృష్టిలో అల్లు అర్జున్ ఎప్పటికే ఆర్యనే”.

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తితో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా, పూజిత జంటగా నటించారు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.

సుకుమార్ అన్నయ్య కుమారుడు అశోక్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. దర్శకత్వ శాఖలో పనిచేయాలనేది అశోక్ లక్ష్యంగా వుండేది. కానీ దర్శకుడితో హీరోగా మారాడు.