బన్నీ, నాని ఒకే రోజు ?

Sunday,April 23,2017 - 12:30 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని తమ లేటెస్ట్ సిఎంమాలతో ఒకే రోజు థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.. ఇప్పటికే ఇద్దరు ఒకే డేట్ ని తమ సినిమాల కోసం లాక్ కూడా చేసేసుకున్నారు.. ఒక వైపు బన్నీ మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో జూన్ 23 న వస్తుంటే, మరో వైపు ఈ డేట్ బన్నీ కంటే ముందే లాక్ చేసుకొని తన లేటెస్ట్ ఫిలిం ‘నిన్ను కోరి’ ని థియేటర్స్ లోకి తీసుకురాకురాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించేశాడు నాని.

సో నిన్నటి వరకూ ఈ డేట్ ని నాని మాత్రమే ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ స్పెషల్ గా లాక్ చేసుకున్నాడు బన్నీ. మరి జూన్ 23 న బన్నీతో నాని పోటీ పడతాడా..? లేదా ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకొని మరో డేట్ కి షిఫ్ట్ అవుతాడా… చూడాలి..