కూతురికి వెరైటీగా పేరుపెట్టిన బన్నీ

Monday,December 26,2016 - 10:49 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుకు డిఫరెంట్ గా పేరుపెట్టాడు. గతనెల అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే. ఆ పాపకు తాజాాగా నామకరణం చేశారు. పాప పేరు అర్హ. అవును.. అర్హ అనే డిఫరెంట్ నేమ్ పెట్టారు. అయితే ఈ పేరు వెనక చాలా లాజిక్ ను, ఇంకెంతో మీనింగ్ ను మనకు వివరిస్తున్నాడు బన్నీ.

అర్హ అనే పేరుపెట్టడం వెనక రీజన్ ఏంటంటే… అర్జున్ లోని A, R అనే అక్షరాల్ని… స్నేహలోని ఆఖరి రెండక్షరాలు H, Aలను కలిపి పాపకు పేరుపెట్టారు. అదే అర్హ. ఇక ఈ పేరుకు అర్థాన్ని కూడా చెబుతున్నాడు బన్నీ. హిందూ సంప్రదాయం ప్రకారం అర్హ అంటే పరమశివుడు అని అర్థమట. ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం.. అర్హ అంటే అత్యంత పవిత్రమైన అనే మీనింగ్ వస్తుందట. మొత్తమ్మీద అర్హ అనే పేరు, బన్నీ కూతురు ఇద్దరూ ట్రెండింగ్ అయిపోయారు. పుట్టిన నెల రోజులకే అర్హ… అప్పుడే డీజే సెట్స్ లోకి కూడా వచ్చి సందడి చేసింది.