బన్ని లింగుస్వామి సినిమా అప్ డేట్స్

Friday,February 24,2017 - 01:09 by Z_CLU

నిన్న మొన్నటి వరకు బన్ని, లింగుస్వామి సినిమా ఆగిపోయిందని, బన్ని అకౌంట్ లో DJ నెక్స్ట్ కాలం ఖాళీ అయిపోయిందని రకరకాలుగా రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ పై సినిమా యూనిట్ కూడా ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వలేదు.

బన్ని DJ సెట్స్ పై బిజీగా ఉంటే, లింగు స్వామి అల్ రెడీ ప్రీ ప్రొడక్షన్ బిగిన్ అయిన ‘సండకోజి 2’ తమిళ వెంచర్ తో బిజీగా ఉన్నాడు. విశాల్ హీరోగా రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే అల్లు అర్జున్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు ఈ మాసివ్ డైరెక్టర్.

ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా కన్ఫం చేసిన లింగుస్వామి, ఇప్పటి దాకా స్ప్రెడ్ అయిన రూమర్స్ ని అతి సున్నితంగా కొట్టి పడేశాడు. ఈ సినిమాతో బన్ని కోలీవుడ్ లో కూడా స్టైలిష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.