'నా పేరు సూర్య' సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం

Friday,August 18,2017 - 11:37 by Z_CLU

బన్నీ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నా పేరు సూర్య. ఎట్టకేలకు అల్లు అర్జున్ ఈ సినిమా సెట్స్ పైకి వచ్చాడు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సెకెండ్ షెడ్యూల్ లో బన్నీ పాల్గొంటున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

మిలట్రీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది నా పేరు సూర్య. ఈ మూవీ కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా ఫిజికల్ ఫిట్ నెస్ ట్రయిలర్ ను హైదరాబాద్ రప్పించారు. అతడి పర్యవేక్షణలో ప్రత్యేకంగ మేకోవర్ అయిన బన్నీ, ఈరోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈ షెడ్యూల్ వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగుతుంది. శరత్ కుమార్ విలన్ గా నటించనున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో అర్జున్ కనిపించబోతున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ మూవీకి నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్.