పవన్ రూట్ లో బన్నీ ?

Thursday,November 10,2016 - 06:47 by Z_CLU

ఓ స్టార్ సినిమా ఈవెంట్ కి ఇంకో స్టార్ అటెండ్ అయితే అది ఎట్రాక్షన్. అదే ఓ చిన్న సినిమాకి ఓ బడా స్టార్ అటెండ్ అయితే అది డెఫ్ఫినేట్ గా ట్రెండ్ సెట్టింగే. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్ కి అటెండ్ అయి, పవన్ కళ్యాణ్ మరోసారి ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు.

ఎంత స్టార్ డం ఉన్న అతి సాధారణ వ్యక్తిలా, ఎక్కడ పడితే అక్కడ… ఏ మాత్రం జంకకుండా వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తక్కిన స్టార్స్ ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూట్ లోనే బన్ని కూడా అడుగులు వేస్తున్నాడు.

బన్ని అటెండ్ అవ్వబోయే సినిమా డీటేల్స్ ఇంకా తెలియలేదు కానీ , అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అనౌన్స్ కాలేదు కానీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా తెరకెక్కుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ లేదా నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలలో ఏదో ఒక సినిమా ఈవెంట్ కి  బన్ని అటెండ్ అవడం గ్యారంటీ అని టాక్.