

Saturday,September 24,2016 - 05:40 by Z_CLU
సినిమాల విషయంలోనే కాదు… హీరోయిన్స్ విషయంలో కూడా బన్నీ చాలా కేర్ తీసుకుంటున్నాడు. తన సరసన నటించే హీరోయిన్ ఎవరనే అంశాన్ని బన్నీనే డిసైడ్ చేస్తున్నాడు. తాజాగా రెండు సినిమాలు ఎనౌన్స్ చేసిన అల్లువారబ్బాయ్… ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు. తాజాగా మరో సినిమా హీరోయిన్ ను కూడా దాదాపు ఫిక్స్ చేసినట్టే కనిపిస్తున్నాడు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో డీజే అని సినిమాను ప్రారంభించాడు బన్నీ. ఈ సినిమాలో పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. దీంతో పాటు లింగుస్వామి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ మూవీతో తమిళనాట కూడా అడుగుపెట్టబోతున్నాడు బన్నీ.