క్లైమాక్స్ స్టేజ్ లో బన్ని DJ

Wednesday,May 03,2017 - 12:59 by Z_CLU

అల్లు అర్జున్ DJ క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది. జూన్ 23 న రిలీజ్ కానున్న ఈ సినిమాని ఏ మాత్రం డిలేస్ కి చాన్సెస్ లేకుండా ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టింది సినిమా యూనిట్.

ప్రస్తుతం మూడు పాటలు, క్లైమాక్స్ సీన్ తప్ప తక్కిన షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన ఈ సినిమాకి బన్ని ఆల్ రెడీ డబ్బింగ్ చెప్పడం కూడా బిగిన్ చేసేశాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

DSP మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుండి హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు బన్ని సరికొత్త గెటప్ సినిమాపై ఆటోమేటిక్ గా క్యూరాసిటీ క్రియేట్ చేస్తుంది.