అది చెర్రీకి... ఇది బన్నీకి...

Tuesday,January 10,2017 - 06:25 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో రికార్డ్ ల మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇప్పటివరకు మెగాస్టార్ సినిమాలేవీ రీమేక్ చేయలేదు. ఇప్పటి వరకు జరిగిందంతా డైరెక్ట్ ఎటాకే. అయితే ఈ ఇద్దరు మెగా హీరోలు, మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ సినిమాల్ని రీమేక్ చేస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఏకంగా మెగాస్టార్ చిరంజీవే స్పందించడం విశేషం.

chiru-274
ఖైదీ నంబర్ 150 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన మెగాస్టార్.. తన రీమేక్స్ ను చెర్రీ, బన్నీ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. అంతేకాదు.. తన హిట్ సినిమాల నుంచి ఎవరు ఏ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందో కూడా సూచిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ అభిప్రాయం ప్రకారం… జగదేకవీరుడు-అతిలోకసుందరి రీమేక్ ను రామ్ చరణ్… రౌడీ అల్లుడు సినిమాను బన్నీ రీమేక్ చేస్తే బాగుంటుందని మెగాస్టార్ మెగా ఫీలింగ్. ఇన్నాళ్లూ ప్రేక్షకులు మాత్రమే రీమేక్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవే తన మనసులో మాట బయటపెట్టారు. సో.. బన్నీ-చెర్రీ ఆ యాంగిల్ లో కూడా ఆలోచిస్తే… త్వరలోనే బాక్సాఫీస్ ను రఫ్ఫాడించడం గ్యారెంటీ.