సాహో సినిమాకు బంపర్ ఆఫర్

Saturday,May 20,2017 - 06:31 by Z_CLU

సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కనీసం ఫస్ట్ షెడ్యూల్ డేట్స్ కూడా రాలేదు. కానీ అంతలోనే సాహో సినిమా హాట్ కేక్ అయిపోయింది. ఈ సినిమాను భారీ మొత్తానికి కొనేందుకు ఈరోస్ సంస్థ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు 400 కోట్ల రూపాయల ఆఫర్ చేసిందట ఎరోస్ సంస్థ. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో థియేట్రికల్ రైట్స్ కలుపుకొని ఈ మొత్తం ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది సాహో మూవీ. ఈ సినిమాకు మొదట 80కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్నారు. తాజాగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ ఫిక్స్ చేశారు. అంటే 150 కోట్ల రూపాయలు పెట్టి తీయబోయే సినిమాకు ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే 400 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందన్నమాట. ఇదంతా బాహుబలి-2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్.

బాహుబలి-2 భారీ విజయంతో ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు అన్ని భాషల్లో ఈ హీరోను గుర్తుపడతారు. అందుకే ఈరోస్ సంస్థ ఇంత మొత్తం పెట్టేందుకు ముందుకొచ్చింది. గతంలో వన్-నేనొక్కడినే, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల రైట్స్ ను కూడా ఇలానే దక్కించుకుంది ఈ సంస్థ.