రెడ్డిగారి కుర్రాళ్లు రెచ్చిపోయారు

Wednesday,April 03,2019 - 11:36 by Z_CLU

ఆర్ఎక్స్100 సినిమా హిట్ అయిన వెంటనే పాయల్ రాజ్ పుత్ ఒప్పుకున్న సినిమా సీత. ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేయడానికి ఆమె ఒప్పుకుంది. అది ఇన్నాళ్లకు బయటకొచ్చింది. కొద్దిసేపటికిందట సీత ఐటెంసాంగ్ ను విడుదల చేశారు. రెడ్డిగారి కుర్రాళ్లు రెచ్చిపోతే ఎట్టా అనే లిరిక్స్ తో సాగే ఈ ఐటెంసాంగ్ ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు.

లిరికల్ వీడియోలో అక్కడక్కడ ఐటెంసాంగ్ మేకింగ్ షాట్స్ కూడా చూపించారు. ఉమా నేహ పాడిన ఈ పాటను సురేంద్ర కృష్ణ రాశాడు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ డైరక్ట్ చేసిన మూవీ ఇదే.