బ్రోచేవారెవరురా టీజర్ రివ్యూ

Saturday,April 20,2019 - 03:08 by Z_CLU

ఈమధ్య కాలంలో టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన సినిమా బ్రోచేవారెవరురా. ఇప్పుడీ సినిమా టైటిల్ తోనే కాదు, టీజర్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. అవును.. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ క్లిక్ అయింది.

సినిమా థీమ్ ను ఎలివేట్ చేస్తూనే, కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేసేలా టీజర్ ను బాగా కట్ చేశారు. బేసిగ్గా ఇందులో మూవీ బ్యాక్ డ్రాప్, ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఓ కిడ్నాప్ మిస్టరీ ఉన్నట్టు టీజర్ చూస్తే అర్థమౌతోంది. ఔత్సాహిత దర్శకుడైన సత్యదేవ్, తన కథతో హీరోయిన్ నివేత పెతురాజ్ ను ఓవైపు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి ఓ గ్యాంగ్ గా కనిపిస్తున్నారు.

టీజర్ కు వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా టీజర్ తో ఇంకాస్త అంచనాల్ని పెంచింది.