సాహో.. బ్రాండ్ న్యూ పోస్టర్

Tuesday,May 21,2019 - 04:01 by Z_CLU

మొన్నటివరకు షేడ్స్ ఆఫ్ సాహో అంటూ ఛాప్టర్లతో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు పోస్టర్ల ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు సాహో నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజైంది. ఓన్లీ ప్రభాస్, అది కూడా క్లోజ్ షాట్ లో కనిపించేలా పోస్టర్ డిజైన్ చేశారు.

ఎప్పట్లానే స్టయిలిష్ లుక్స్ తో అదరగొట్టాడు ప్రభాస్. హెయిర్ స్టయిల్ నుంచి పెట్టుకున్న అద్దాల వరకు అన్నీ కొత్తగా, ట్రెండీగా ఉన్నాయి. ఆ ఇంటెన్స్-సీరియస్ లుక్ లోనే సాహో సినిమా సబ్జెక్ట్ ఏంటో చెప్పకనే చెప్పేశారు.

ఇకపై దశలవారీగా సాహో నుంచి ఏదో ఒక ప్రమోషనల్ మెటీరియల్ వచ్చేలా ప్లాన్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్ స్పీడ్ మరింత పెంచాలని ఫిక్స్ అయ్యారు. పోస్టర్ రిలీజ్ సందర్భంగా రిలీజ్ డేట్ (ఆగస్ట్ 15)పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్

దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.