బ్రాండ్ బాబు ట్రైలర్ – ఇమోషనల్ డోస్ తో...

Thursday,July 26,2018 - 03:04 by Z_CLU

ఈషా రెబ్బ, సుమంత్ శైలేంద్ర జంటగా నటించిన బ్రాండ్ బాబు ట్రైలర్ రిలీజయింది. ఆగష్టు 3 న గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.  మారుతి మార్క్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా P. ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది. అయితే ఈ రోజు రిలీజైన 1: 31 సెకన్ల ట్రైలర్ సినిమా మెయిన్ స్టోరీలైన్ ఎలివేట్ చేస్తుంది.

చేసే పని ఏదైనా బ్రాండ్ వ్యాల్యూ ఉండేలా చూసుకునే హీరో ఒక పని మనిషితో ప్రేమలోపడితే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. అయితే ఈ రోజు రిలీజైన ఈ ట్రైలర్ తో సినిమాలో కామెడీ తో పాటు ఇమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

బ్రాండ్ కి ఇమోషనల్ లవ్ జర్నీ మధ్య ఏది గెలిచింది..? సినిమాలో లీడ్ రోల్ సక్సెస్ అవుతుందా లేదా…? అనేదే ఈ సినిమాలో ఇమోషనల్ పాయింట్. ఈషా రెబ్బ పనిమనిషి రోల్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయినట్టనిపిస్తుంది.

శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై S. శైలేంద్ర బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి J.B. మ్యూజిక్ కంపోజ్ చేశాడు. మురళీ శర్మ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.