తేల్చి చెప్పిన బ్రహ్మి

Tuesday,October 25,2016 - 01:07 by Z_CLU

టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం త్వరలో దర్శకత్వం చేయబోతున్నాడనే వార్త ను ఖండించారు. ఇటీవలే ఆఫర్స్ తగ్గడం తో బ్రహ్మి ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని, ఆ సినిమాలో అనసూయ, రష్మీ ముఖ్య పాత్రలు పోషించనున్నారనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.
brahmanandam-about-alludu-seenu-movie_iqlik123iqlik672d97-b192aa

    అయితే ఇప్పటికే, అవసరాల, వెన్నెల కిషోర్ వంటి నటులు దర్శకత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కృష్ణ భగవాన్ కూడా త్వరలో అల్లరి నరేష్ ను డైరెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. బ్రహ్మి కూడా అదే కోవలోకి వెళ్తారేమో అనుకున్నారంతా. ఇటీవలే ఆ వార్త లో నిజం లేదని. తన కు దర్శకత్వం మీద ఇంటరెస్ట్ లేదని కేవలం నటుడు గానే పరిశ్రమ లో కొనసాగుతానని వెల్లడించాడు ఈ స్టార్ కమెడియన్.