సర్జరీ నుంచి కోలుకుంటున్న బ్రహ్మానందం

Thursday,January 17,2019 - 03:45 by Z_CLU

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హార్ట్ సర్జరీ నుంచి మెల్లగా కోలుకుంటున్నారు. ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో బ్రహ్మానందంకు సక్సెస్ ఫుల్ గా హార్ట్ సర్జరీ ముగిసింది. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ చేసినట్టు బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ ప్రకటించాడు.

కొన్ని నెలలుగా ఛాతిలో ఇబ్బంది ఫీల్ అవుతున్నారు బ్రహ్మానందం. డాక్టర్ల సలహా మేరకు సోమవారం హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. బ్రహ్మానందంకు ఆపరేషన్ జరగడంతో సినీపరిశ్రమ మొత్తం ఆందోళన చెందింది. ప్రముఖులంతా బ్రహ్మానందం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.

బ్రహ్మానందం అనారోగ్యంగా ఉన్నారనే వార్త తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన ఆందోళన, రాజా గౌతమ్ ప్రకటనతో కొద్దిగా ఊరట కలిగింది.