బ్రహ్మాజీ ఇంటర్వ్యూ - నెక్ట్స్ నువ్వే మూవీ

Wednesday,October 18,2017 - 03:30 by Z_CLU

ఆది హీరోగా ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’ మూవీ నవంబర్ 3 న రిలీజవుతుంది. V4 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో బ్రహ్మాజీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇప్పటికే మూవీ లవర్స్ లో ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘నెక్స్ట్ నువ్వే’  సినిమాకు సంబంధించి మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు బ్రహ్మాజీ… ఆ చిట్ చాట్ మీకోసం…

అదే ఈ సినిమాలో ప్రత్యేకత

నా కరియర్ మొత్తంలో నేనిలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదు. ఈ సినిమాలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఏ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ డిఫెరెంట్ గా ఉంటుంది. ఒక్కో సిచ్యువేషన్ బట్టి ఫ్లక్చువేట్ అవుతూంటుంది. ఈ క్యారెక్టర్ ఇక ఇలాగే రియాక్ట్ అవుతుంది గెస్ చేసే చాన్స్ కూడా ప్రతీది కొత్తగా ఉంటుంది.

నాకు కామెడీ పండించడం రాదు…

ఈ సినిమాలో సిచ్యువేషన్స్ లోనే బోలెడంత కామెడీ ఉంటుంది. దాంతో నా క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుంది. నాకు కమెడియన్ లా కామెడీ చేయడం సిచ్యువేషన్ ని బట్టి నటించడమే. బేసిగ్గా కంటెంట్ లోనే కామెడీ ఉండటంతో నేనున్న సీన్స్ లలో కామెడీ చాలా హైలెట్ అవుతుంది.

నాకు క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ …

ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసి ఉంటానా..? అనెప్పుడూ కౌంట్ చేసుకోలేదు. ఎందుకంటే కొన్ని సినిమాలు ఇష్టపడి చేస్తే, కొన్ని సినిమాలు డబ్బు కోసం, PR కోసం.. ఇలా చేస్తూనే ఉన్నాను. ఇక మరీ ఇష్టపడి నచ్చి చేసిన చేసిన సినిమాలంటే మహా అయితే 40 సినిమాలు చేసి ఉంటా…

సీనియర్ డైరెక్టర్ లా చేశాడు…

ప్రభాకర్ ఇప్పటికే చాలా T.V. షోస్ చేసి ఉన్నాడు కాబట్టి, సినిమాని సీనియర్ డైరెక్టర్ లాగే హ్యాండిల్ చేశాడు. ఒరిజనల్ సినిమాలో ఉన్న కంటెంట్ తో పోలిస్తే, చాలా చేంజెస్ చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది.

హీరోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి తేడా అదే…

హీరోగా చేస్తే చాలా ప్రెజర్ ఉంటుంది. సినిమా సక్సెస్ అయినా, ఫ్లాప్ అయినా దాని డైరెక్ట్ ఇంపాక్ట్ కరియర్ పై పడుతుంది. కానీ క్యాక్యారెక్టర్ ఆర్టిస్ట్ కి అలా కాదు, సినిమా సక్సెస్ అయినా కాకపోయినా, పర్ఫామెన్స్ బావుంటే చాలు, నెక్స్ట్ చాన్సెస్ వస్తాయి. కాబట్టి హీరోగా చేసినప్పటి కన్నా ఇప్పుడే బావుంది… రిలాక్స్డ్ గా ఏ ప్రెజర్ లేకుండా…

ప్రతీది హైలెటే…

నెక్స్ట్ నువ్వే సినిమాలో ప్రతీది హైలెటే. ఇదేదో రెగ్యులర్ స్టేట్ మెంట్ కాదు. ఫన్, హారర్, కామెడీని మిక్స్ చేసిన పర్ ఫెక్ట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో ప్రతి సీన్ హైలెట్ గా ఉంటుంది.

డైరెక్షన్ చేయడం చాలా ఈజీ…

నేను డైరెక్టర్ ని అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. డైరెక్షన్ చేయడం చాలా ఈజీ. కానీ మంచి డైరెక్టర్ అనిపించుకోవడం చాలా కష్టం. మంచి డైరెక్టర్ అనిపించుకోవాలంటే బాగా చదువుకుని ఉండాలి, లైఫ్ లో అనుభవాలు, మంచి విజన్ ఉన్నవాళ్ళే మంచి డైరెక్టర్స్ అవుతారు…

నాకు ఆ అవసరం లేదు…

నాకు యాక్టింగ్ తప్ప మరొకటి చేతకాదు, ప్రొడ్యూసర్ ని అయిపోవాలి, డైరెక్టర్ ని అయిపోవాలి అనే యాంగిల్ లో కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. అసలా అవసరం లేదు. మంచి ప్రొడ్యూసర్స్ , డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు.. కాబట్టి లైఫ్ లాంగ్ యాక్టింగ్ ఒక్కటే చేస్తాను…

అదే నా డ్రీమ్ క్యారెక్టర్

ఇలాంటి క్యారెక్టరే చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు, వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని చేశాను, ఇక పర్టికులర్ డ్రీమ్ క్యారెక్టర్ అంటే, నెక్స్ట్ రాబోయే అవకాశం అయి ఉండొచ్చు, చెప్పలేము చేసుకుంటో వెళ్తుంటే అందులో కొన్ని క్యారెక్టర్స్ స్పెషల్ గా నిలిచిపోతాయి.

అదే నా అదృష్టం

నాకంటూ పర్టికులర్ ఇమేజ్ లేదు అదే నా అదృష్టం. నా పేరు టాప్ కమెడియన్స్ లలో ఉండదు. విలన్స్ లో ఉండదు. మంచి క్యారెక్టర్ ఆరిస్ట్ అనే గుర్తింపు ఉంది. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమాలో CM గారి PA గా చేస్తున్నారు, రంగస్థలంలో విలేజ్ డెవెలప్ మెంట్ ఆఫీసర్ గా చేస్తున్నాను, నెక్స్ట్ నువ్వే శరత్ గా చేశాను.. ఒక్కో క్యారెక్టర్ కి చాల వేరియేషన్స్ ఉంటుంది.

నెక్స్ట్ నువ్వే ఆల్ రెడీ సూపర్ హిట్టయింది

అల్లు అరవింద్ గారు, బన్ని వాసు గారు, జ్ఞానవేల్ రాజా, వంశీ-ప్రమోద్ టాప్ ప్రొడ్యూసర్స్. ఒక చిన్న సినిమాని ఇంత ఇష్టపడి చేశారంటేనే ఆల్మోస్ట్ సినిమా సూపర్ హిట్టయిపోయింది. ఇక ఏ రేంజ్ హిట్టయిందనేది రేపు రిలీజయ్యాక తెలుస్తుంది.