#BoyapatiRAPO యాక్షన్ సీక్వెన్స్ మొదలు పెట్టిన రామ్ !

Tuesday,November 08,2022 - 05:44 by Z_CLU

#BoyapatiRAPO Action Schedule Begins In RFC

రామ్ పోతినేని (Ram Pothineni) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఇటివలే షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యుల్ లో కొన్ని సీన్స్ తో పాటు ఐటెం సాంగ్ కంప్లీట్ చేశారు. రామ్ -ఊర్వశీ రౌతెల కాంబినేషన్ లో సాంగ్ షూట్ పూర్తయింది. సాంగ్ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న యూనిట్ నేటి నుండి రామోజీ ఫిలిం సిటీలో మరో షెడ్యుల్ మొదలు పెట్టారు.

రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీక్వెన్స్ తో షెడ్యుల్ మొదలైంది. స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. బోయపాటి సినిమాలో యాక్షన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ తో కంప్లీట్ మాస్ యాక్షన్ హీరోగా మారిన రామ్ ను ఈ సినిమాతో మరింత మాస్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు బోయపాటి.

రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics