ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చాడు...

Sunday,November 20,2016 - 12:02 by Z_CLU

సరైనోడు తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను ఈరోజు నుంచి సెట్స్ పైకి వచ్చాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు సాయి హీరోగా ఓ సినిమాను తీయబోతున్నానని గతంలోనే బోయపాటి ప్రకటించాడు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఈరోజు నుంచి సెట్స్ పైకి వచ్చింది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో సినిమా చేసిన సాయి.. ఈసారి తన కొత్త సినిమా కోసం రకుల్ ను సెలక్ట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ భామ… చెర్రీతో కలిసి ధృవ సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో.. ఈరోజు నుంచి బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు మహేష్ బాబు-మురుగదాస్ సినిమా షూటింగ్ లో కూడా బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్.