బోయపాటి నెక్ట్స్ సినిమాపై క్లారిటీ

Sunday,March 12,2017 - 03:02 by Z_CLU

సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బోయపాటి శ్రీను ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. మీడియాకు దూరంగా ఉంటూ తన ఫోకస్ మొత్తం కొత్త సినిమాపైనే పెట్టారు. అలా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాను విరామం లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్నారు బోయపాటి. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు పేరు పెట్టలేదు. ఓ మాస్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం… బోయపాటి-సాయిశ్రీనివాస్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఆ టైటిల్ ఏంటనే విషయాన్ని ఉగాది రోజున ఎనౌన్స్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది.