రవితేజ, నాగశౌర్య మధ్య మరోసారి పోటీ

Tuesday,May 22,2018 - 11:44 by Z_CLU

ఈ ఏడాది ఫిబ్రవరిలో రవితేజ, నాగశౌర్య ఓసారి పోటీపడ్డారు. రవితేజ నటించిన టచ్ చేసి చూడు, నాగశౌర్య చేసిన ఛలో సినిమాలు రెండూ ఫిబ్రవరి 2నే వచ్చాయి. వీటిలో ఛలో సూపర్ హిట్ అయింది. అలా నాగశౌర్య అప్పర్ హ్యాండ్ సాధించాడు. కొన్ని నెలల గ్యాప్ లో ఈ ఇద్దరు హీరోలు మరోసారి తలపడబోతున్నారు.

ఈ వీకెండ్ (మే 25) మరోసారి నాగశౌర్య, రవితేజ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. నాగశౌర్య నటించిన అమ్మమ్మగారిల్లు, రవితేజ నటించిన నేటటిక్కెట్టు సినిమాలు బాక్సాఫీస్ బరిలో లక్ చెక్ చేసుకోబోతున్నాయి. గమ్మత్తుగా ఈసారి కూడా వస్తున్నవి ఈ రెండు సినిమాలు మాత్రమే.

కుటుంబ బంధాలు, సాఫ్ట్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో అమ్మమ్మగారిల్లు అనే క్లాస్ సినిమా చేశాడు నాగశౌర్య. చాన్నాళ్ల తర్వాత షామిలి ఇందులో హీరోయిన్ గా నటించింది. సుందర్ సూర్య డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు.

ఇక పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన మూవీ నేలటిక్కెట్టు. టైటిల్ తో స్టార్ట్ చేస్తే ఎండ్ కార్డ్ వరకు అంతా మాసే. కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రవితేజ-మాళవిక హీరోహీరోయిన్లు. శక్తికాంత్ సంగీతం అందించాడు. సో.. ఈ వీకెండ్ మాస్ Vs క్లాస్ అన్నమాట. గెలుపెవరిదో చూద్దాం.