Kantara Telugu రెండు రోజుల కలెక్షన్స్

Monday,October 17,2022 - 01:14 by Z_CLU

‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా  తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిల్మ్ డిస్ట్ బ్యూషన్” ద్వారా తెలుగులో రిలీజ్ చేశారు.  మొదటి రోజు 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు 6.5 కోట్ల గ్రాస్ సాదించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 11కోట్ల 5 గ్రాస్ వసూళ్ళు సాదించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.  వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ దాటేసిన ‘కాంతార’ విజయఢంకాను మోగిస్తుంది.

ముఖ్యంగా “కాంతార” క్లైమాక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. చివరి 15 నిమిషాలు రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూపించాడు. థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా  క్లైమాక్స్ ను డిజైన్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేసాడు అనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు.