Chiranjeevi's Waltair Veerayya: బాస్ వచ్చిండు కిక్ ఇచ్చిండు

Wednesday,November 23,2022 - 04:40 by Z_CLU

Boss Party From Megastar Chiranjeevi’ Waltair Veerayya Unveiled

 మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’  నుండి ఫస్ట్ సింగిల్ రిలీజైంది.  బాస్ పార్టీ  అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజిషన్ తో పాటు లిరిక్స్ కూడా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. వేర్ ఈజ్ ద పార్టీ ? అంటూ అందాల భామ అడుగుతుంటే ఆమెకు పార్టీల గురించి  వీరయ్య చెప్తూ వచ్చే ఈ మాస్ ఐటెం సాంగ్ సినిమాకు హైలైట్ కానుందని అర్థమవుతుంది. ముఖ్యంగా సాంగ్ లో  మెగాస్టార్ గ్రేస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాయనిపిస్తుంది. థియేటర్స్ లో ఈ సాంగ్ మాస్ కి పూనకం తెప్పించడం ఖాయమనిపిస్తుంది.

దేవి కిక్కిచ్చే ట్యూన్ ,  మెగా స్టార్ మాస్ స్టెప్స్  , ఆర్ట్ వర్క్ , ఊర్వశీ అందాలు వెరసి ఈ సాంగ్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. లిరికల్ వీడియో వర్క్ కూడా ఎట్రాక్టివ్ గా ఉంది. సాంగ్ లో కనిపించే ఐటమ్స్ వాడుకుంటూ వాటి మీద పేర్లు వేయడం ఆకట్టుకుంది. ఓవరాల్ గా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) నుండి రిలీజైన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అనిపించుకొని రాబోయే సాంగ్స్ మీద మరిన్ని అంచనాలు పెంచేసింది.

మాస్ మహారాజా స్పెషల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై యర్నేని నవీన్ , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics