బాలీవుడ్ టు టాలీవుడ్

Tuesday,January 24,2017 - 05:13 by Z_CLU

టాలీవుడ్ మరిన్ని కలర్స్ తో మెస్మరైజ్ చేయబోతుంది. 2016 లో ఎక్స్ ట్రీం హిట్ రేషియోతో సక్సెస్ ట్రాక్ లో పడిన టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు జస్ట్ బాలీవుడ్ అని సరిపెట్టుకున్న బాలీవుడ్ భామలు ఇప్పుడు టాలీవుడ్ చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

011

టాలీవుడ్ కి ఈ స్ట్రాంగ్ ముద్దుగుమ్మ ఆల్ రెడీ పరిచయమే. గతంలో రజినీకాంత్ తో లింగ సినిమాలో నటించిన సోనాక్షి, టాలీవుడ్ నుండి మంచి ఛాన్స్ రావాలే కానీ, సినిమాకి రెడీ అని ఆల్ రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

022

పరిణీతి కూడా టాలీవుడ్ లో ఎంట్రీకి లాంగ్ లాంగ్ బ్యాక్ నుండి వెయిటింగ్. ఇప్పటికే మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేసినా, అన్నీ కలిసిరాక ఇంకాస్త టైం పడుతుంది కానీ, రేపో మాపో ఓ స్టార్ హీరో సరసన పరిణీతి దిగుమతి మాత్రం గ్యారంటీ.

033

కొచ్చాడియన్ తో ఆల్ రెడీ సౌత్ ఇండియన్ సినిమాలో ఎంట్రీ ఇచ్చేసిన దీపికా పడుకొన్ కి టాలీవుడ్ కి మధ్య దూరం జస్ట్ టైం మాత్రమే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ ఎంట్రీ తోను బిజీగా ఉన్న దీపికా, తెలుగు స్క్రీన్ పై వెలిగిపోయే రోజు ఎంతో దూరంలో లేదు.

044

ఇప్పటి దాకా ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా, జహ్నవికి శ్రీదేవి ఉన్నంత క్రేజ్ క్రియేట్ ఉంది. ఎంట్రీ బాలీవుడ్ లో చేయాలని డిసైడ్ అయినా, అమ్మడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి.

055

ఆ మధ్య జంజీర్ లో రామ్ చరణ్ సరసన నటించిన ప్రియాంక చోప్రా, మళ్ళీ ఇంకో సినిమాకి సంతకం పెట్టలేదు. రైట్ టైం చూసి మంచి ఆఫర్ తో అప్రోచ్ అవ్వాలి కానీ, ప్రియాంక చోప్రా టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసే చాన్సెస్ లేకపోలేదు.

066

నిజానికి అమ్మడు ట్యాలెంట్ ని బాలీవుడ్ కన్నా ముందుగా పసిగట్టింది మనవాళ్ళే. గతంలో వెంకీతో మల్లీశ్వరి, బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాలలో కనిపించినా, ఆ తరవాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదీ పొడుగు కాళ్ళ సుందరి. గతంతో పోలిస్తే, ఈ మధ్య బాలీవుడ్ లో స్పీడ్ తగ్గించిన కత్రినా, టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చే చాన్సెస్ అయితే చాలా ఉన్నాయి.

077

 రజినీకాంత్ రోబో సినిమాలో నటించిన ఈ ప్రపంచ సుందరి, సెకండ్ ఇన్నింగ్స్ లోను కరియర్ ని సక్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకుంటుంది. సో.. టాలీవుడ్ లో చాన్స్ రావాలే కానీ వదులుకునే చాన్సే లేదు.