వెయ్యి కోట్ల మహాభారతంలో కర్ణుడు ఫిక్స్ అయ్యాడు

Friday,July 21,2017 - 03:13 by Z_CLU

వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహాభారతం సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంది. 2020 లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడిగా నటిస్తున్నాడు. ఇంకా తక్కిన క్యారెక్టర్స్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, కర్ణుడి క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్ ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది.

 

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రెస్టీజియస్ వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి మరి హృతిక్ రోషన్ సంతకం చేశాడా లేదా అన్నది ఇంకా కన్ఫం కాలేదు. UAE బిజినెస్ మ్యాన్ BR శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమాని 2 పార్ట్స్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. శ్రీ కుమార్ మీనన్ ఈ సినిమాకి డైరెక్టర్.