ధృవ కోసం బాలీవుడ్ ఖాన్స్

Monday,December 05,2016 - 11:22 by Z_CLU

నిన్న జరిగిన ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సూపర్ హిట్టయింది. ఇక మిగిలింది సినిమా సూపర్ హిట్టవడమే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ధృవ’ కోసం జస్ట్ సినిమా యూనిటే కాదు ఏకంగా బాలీవుడ్ స్టార్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు.

స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘ధృవ’ కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డాడో ధృవ మేకింగ్ వీడియో తెలుస్తుంది. సాధారణంగా సినిమా అంటే స్టోరీ, సాంగ్స్, ఫైట్స్, లోకేషన్స్, స్టార్స్.. కానీ రామ్ చరణ్ ‘ధృవ’ ని తన బాడీ బిల్డింగ్ నుండి మొదలుపెట్టాడు.

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ స్టార్స్ ల పర్సనల్ ఫిట్ నెస్ ట్రేనర్ రాకేశ్ ఉడియార్ రామ్ చరణ్ కి ట్రేనింగ్ ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లిద్దరూ రామ్ చరణ్ ఫిట్ నెస్ ట్రేనింగ్ విషయంలో బిగినింగ్ నుండే చాలా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది.