మహేష్ సినిమాకు బాలీవుడ్ కెమెరామెన్

Saturday,March 03,2018 - 10:01 by Z_CLU

సూపర్‌స్టార్‌ మహేష్‌ కథానాయకుడుగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ పనిచేయనున్నారు.

బాలీవుడ్‌లో 2006లో వచ్చిన డాన్‌ చిత్రానికి, తలాష్‌, రయీస్‌ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ని అందించిన కె.యు.మోహనన్‌… సూపర్‌స్టార్‌ మహేష్‌ నటిస్తున్న 25వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయనున్నారు. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌
సినిమాటోగ్రఫీ: కె.యు.మోహనన్‌
నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి