అల్లు అర్జున్ సినిమాకి బాలీవుడ్ కొరియోగ్రాఫర్

Saturday,December 02,2017 - 02:44 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ప్రస్తుతం గోవాలో లో షూటింగ్ జరుపుకుంటుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త మ్యానరిజం తో మెస్మరైజ్ చేయనున్నాడు. అయితే సినిమాలో హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే కీ ఎలిమెంట్స్ తో పాటు డ్యాన్స్ విషయంలోను స్పెషల్ కేర్ తీసుకునే బన్ని ఈ సినిమాలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ని ప్రిఫర్ చేశాడు.

 

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీమ్ లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ కూడా చేరింది. విశాల్ – శేఖర్ కంపోజ్ చేస్తున్న సాంగ్స్ కి వైభవి అల్లు అర్జున్ మార్క్ స్టెప్స్ ని కంపోజ్ చేయనుంది. అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రియల్ 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది.  లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా ఈ సినిమాని  నిర్మిస్తున్నారు.