SarkaruVaariPata లో బాలీవుడ్ హీరోయిన్ ?

Wednesday,September 16,2020 - 12:59 by Z_CLU

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న Mahesh ‘SarkaruVaariPata’ జనవరి నుండి షూటింగ్ మొదలు కానుంది. మొదటి షెడ్యుల్ ను US లో షూట్ చేయడానికి రెడీ అవుతుంది టీం. ఈలోపు ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు Parasuram. సినిమాలో ఓ కీ రోల్ కోసం  బాలీవుడ్ హీరోయిన్ Vidya Balan ను తీసుకోనున్నారని సమాచారం.

సినిమాలో విద్యాబాలన్, మహేష్ కి అక్కగా కనిపించనుందని తెలుస్తుంది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను Mythri Movie Makers, 14 Reels Plus సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ సరసన Keerthy Suresh హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు Thaman మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.