వెంకటేష్, నాగచైతన్యతో బాబి సినిమా?

Saturday,March 17,2018 - 04:57 by Z_CLU

బాబి డైరెక్షన్ లో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నడంటూ ఈ మధ్యే ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్పే అయినా ప్రాజెక్ట్ సెట్ అయ్యే చాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే డైరక్టర్ బాబి హీరో నాగచైతన్య మధ్య ఈ సినిమాకు సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నాయని, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తాడనే టాక్ వినిపిస్తుంది.

మొన్నటి వరకూ వీరిద్దరితో కళ్యాణ్ కృష్ణ ఓ సినిమా చేస్తాడనే వార్త వినిపించగా ఇప్పుడు ఈ కాంబినేషన్ ని బాబీ సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. సైమల్టేనియస్ గా మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా.. లేటెస్ట్ గా శివనిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు ట్వీట్ కూడా చేశాడు.

ఇన్ని సినిమాల మధ్య బాబితో చైతూ సినిమా ఉంటుందా..? అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. జై లవకుశ తర్వాత బాబీ రవితేజతో ఓ సినిమా చేస్తాడనే వార్త వినిపించింది. కాని ఇప్పుడు బాబి నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు.