'బ్లఫ్ మాస్టర్' ట్రైలర్ రివ్యూ

Sunday,December 09,2018 - 10:24 by Z_CLU

గోపి గణేష్ డైరెక్షన్ లో సత్య దేవ్ హీరోగా తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’ ట్రైలర్ రిలీజయింది. తమిళ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ సాదించిన ‘సతురంగ వెట్టై’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’ ట్రైలర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

” ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ.. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ” అనే డైలాగ్ తో ప్రారంభమై… ‘మనీ ఈజ్ ఆల్ వేస్ అల్టిమేట్’ అంటూ ఎండ్ అయిన ఈ ట్రైలర్ సినిమాలోని కీ ఎలెమెంట్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ పర్ఫెక్ట్ ట్రైలర్స్ అనిపించుకుంటుంది.

ముఖ్యంగా ట్రైలర్ లో దాశరధి సినిమాటోగ్రఫీ , సునీల్ కాశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవర్ ఫుల్ డైలాగ్స్ మెయిన్ హైలైట్స్ గా నిలుస్తున్నాయి. నందిత శ్వేతా – సత్య మధ్య వచ్చే సీన్స్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలలో సత్య దేవ్ నటన చూస్తే హీరోగా తన సత్తా చాటే సినిమా దొరికిందనిపిస్తుంది. డబ్బు సంపాదించడమే ఆశయంగా పెట్టుకొని తన టాలెంట్ తో మోసాలు చేస్తూ డబ్బు సంపాదించే ఓ కుర్రాడి కథే ‘బ్లఫ్ మాస్టర్’ మెయిన్ థీమ్.  సినిమా థీమ్ ను ట్రైలర్ లో సూటిగా సుట్టిలేకుండా చెప్పారు.

ట్రైలర్ చూస్తే క్రైం థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ రీమేక్ సినిమాను దర్శకుడు గోపి గణేష్ పర్ఫెక్ట్ గా డీల్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి డిసెంబర్ 28 న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాదిస్తుందో..చూడాలి.