బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లిస్టులో మహేష్, విజయ్ !

Sunday,July 14,2019 - 01:53 by Z_CLU

గతేడాది ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురాం (బుజ్జి) నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్ తో ఓ రెండు సిట్టింగ్స్ కూడా జరిగాయట. ఫైనల్ సిట్టింగ్ ఒకటే బ్యాలెన్స్. ఆ సిట్టింగ్ తర్వాత వీరిద్దరి కాంబో సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది. అయితే ఈ లోపు విజయ్ కోసం కూడా ఓ కథ రెడీ చేస్తున్నాడట పరశురాం. అంటే మహేష్ తర్వాత పరశురాం మళ్ళీ విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతానికైతే మహేష్ సినిమా కథ మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు పరశురాం. ఫస్ట్ టైం ఓ టాప్ స్టార్ తో సినిమా చేస్తుండడమే దీనికి రీజన్. ఇప్పటికే గీత గోవిందం తో వంద కోట్ల క్లబ్ దర్శకుల్లో చేరిన పరశురాం మహేష్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని చూస్తున్నాడు. అన్ని కుదిరితే మహేష్ -పరశురాం బుజ్జి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఛాన్స్ ఉంది.