బర్త్ డే స్పెషల్

Saturday,May 20,2017 - 09:30 by Z_CLU

హై వోల్టేజ్ యాక్షన్ కి పెట్టింది పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి తారకరామారావు గారి మనవడిగా హరికృష్ణ కుమారుడిగా ‘నిన్ను చూడాలని’ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు.


రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా ‘స్టూడెంట్ నంబర్ 1’.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించి హీరోగా తారక్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో అనుకోని సందర్భంలో హంతకుడిగా మారి స్టూడెంట్ గా కొనసాగే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఇరగదీశాడు.


అప్పటి వరకూ హీరోగా మూడు సినిమాలు చేసిన ఎన్టీఆర్ ను ఒక్కసారిగా స్టార్ హీరో లిస్టులోకి చేర్చిన సినిమా ‘ఆది’. గత సినిమాల్లో క్లాస్ లుక్ లో క్లాస్ నటనతో ఎంటర్టైన్ చేసిన యంగ్ టైగర్.. ఆదిలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చూసి ఫీదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.


ఆది సినిమాతో హీరోగా అదరగొట్టేసిన ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమాతో అప్పటి వరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను చెల్లాచెదురు చేశాడు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెండో సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.


ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా అందులో ‘రాఖీ’ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. తనలోని సరికొత్త ఎమోషన్ ను బయటపెట్టి ‘రాఖీ’గా అందరితో శభాష్ అనిపించుకున్నాడు యంగ్ టైగర్. ఎట్రాక్ట్ చేశాడు తారక్.


ఎన్టీఆర్ ను ఎప్పటికైనా పౌరాణిక పాత్రలో చూడాలనుకున్న అభిమానుల కోరిక తీర్చిన సినిమా ‘యమదొంగ’. పౌరాణికాలకు పెట్టింది పేరైన నందమూరి తారకరామారావు మనవడిగా ఈ సినిమాలో ఓ సన్నివేశంలో యముడిగా పౌరాణిక గెటప్ లో కనిపించి తనదైన డైలాగ్ డెలివరీ, నటనతో మెస్మరైజ్ చేసి భళా అనిపించుకున్నాడు ఎన్టీఆర్.


బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలతో యాక్షన్ హీరోగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ను ఎంటర్టైనింగ్ వే లోకి తీసుకొచ్చిన సినిమా ‘అదుర్స్’. ఈ సినిమాలో ఓ వైపు కామెడీ ని పండించే బ్రాహ్మణ పాత్రలో కనిపిస్తూనే మరో వైపు రౌడీలను వెంటాడే మాస్ క్యారెక్టర్ తో అదుర్స్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్.


ఎన్టీఆర్ సడెన్ గా క్లాస్ లుక్, క్లాస్ పెర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేసి ఎంటర్టైన్ చేసిన సినిమా ‘బృందావనం’. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ సూపర్ హిట్ లిస్ట్ లో మంచి ప్లేస్ అందుకుంది.


ఎన్టీఆర్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన మరో హిట్ మూవీ ‘టెంపర్’. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో మొదలుపెట్టి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకోవడం స్టార్ట్ చేశాడు తారక్.


తారక్ కి బాగా కలిసొచ్చిన ఏడాది అంటే అది 2016 అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఏడాది ప్రారంభంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్ ఇదే ఏడాది ‘జనతా గ్యారేజ్’ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు తారక్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించి బ్లాక్ బస్టర్స్ నిలవడమే కాకుండా నటుడిగా ఎన్టీఆర్ కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి.


ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘జై లవకుశ’. బాబీ డైరెక్షన్ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు తారక్.


ప్రెజెంట్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని హీరోగా ఇలాగే దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జీ సినిమాలు.