బర్త్ డే స్పెషల్.. లిల్లీగా మెరిసిన రష్మిక

Friday,April 05,2019 - 12:08 by Z_CLU

ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది రష్మిక. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీకి, సెలబ్స్ అంతా విశెష్ అందిస్తున్నారు. ఈ పుట్టినరోజు నాడు రష్మిక కాస్తా లిల్లీగా మారిపోయింది.

మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తోంది రష్మిక. దాని పేరు డియర్ కామ్రేడ్. బర్త్ డే సందర్భంగా ఆ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. లిల్లీ అనే పాత్రలో బ్యాట్ పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి మరో న్యూస్ కూడా రివీల్ చేశారు మేకర్స్. డియర్ కామ్రేడ్ కు సంబంధించి సోమవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు.