Bimbisara జీ5లో అదరగొడుతున్న బింబిసారుడు

Friday,October 21,2022 - 03:33 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘బింబిసార’  జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. దీపావళి స్పెషల్ గా ఓటీటీ ఆడియన్స్ ముందుకొచ్చిన బింబిసార ప్రస్తుతం భారీ వ్యూస్ తో దూసుకెళ్తోంది. త్రిగర్తల సామ్రాజ్యాదిపతి బింబిసారుడి కథతో సైన్స్ ఫిక్షనల్ అండ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.

వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార అన్ని రకాల ప్రేక్షకుల్ని మెప్పించి మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ , కీరవాణి మ్యూజిక్ , పాప తాలూకు ఎమోషనల్ సీన్స్  , కామెడీ సినిమాలో మేజర్ హైలైట్స్.  దీపావళికి  సినిమా కుటుంబమంతా కలిసి ఇంట్లో చూసే సినిమా ఇది. ఇప్పటికే భారీ వ్యూస్ కొల్లగొడుతూ వెళ్తున్న బింబిసార ను ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.

Bimbisara On Zee5

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics