బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్

Thursday,June 15,2017 - 11:05 by Z_CLU

ఇప్పటివరకు బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సరైనోడు సినిమా. వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో విడుదలైన సినిమా కూడా అదే. అయితే డీజే విడుదలైనంత వరకే ఆ రికార్డు. దువ్వాడ జగన్నాథమ్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ రెండు రికార్డులు బద్దలవ్వడం ఖాయం. అవును.. బన్నీ కెరీర్ లోనే భారీ స్థాయిలో డీజే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ జగన్నాథమ్ కోసం మ్యాగ్జిమమ్ థియేటర్లు కేటాయిస్తున్నారు. బాహుబలి-2 మేనియా తగ్గడం, బడా సినిమాలేవీ బరిలో లేకపోవడంతో డీజేకు హయ్యస్ట్ థియేటర్లు దక్కే ఛాన్స్ ఉంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డీజే ట్రయిలర్స్, సాంగ్స్ కు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఓవర్సీస్ లో ఈసారి థియేటర్స్ కౌంట్ పెంచుతున్నారు.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసే ఛాన్స్ ఉంది. సరైనోడు సెంటిమెంట్ ను కొనసాగిస్తూ, వైజాగ్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారట. హరీష్ శంకర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది డీజే.