శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్...

Monday,January 23,2017 - 08:35 by Z_CLU

సెంటిమెంట్ నిలుపుకోవడమే కాదు… కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కూడా అందుకున్నాడు శర్వానంద్. బడా సినిమాలు బరిలో ఉంటే తమ సినిమాలు రిలీజ్ చేయడానికి సంకోచించే ఈరోజుల్లో… శర్వానంద్ వరుసగా రెండోసారి అలాంటి సాహసం చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. దిల్ రాజు బ్యానర్ పై శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబడుతోంది. ఓవరాల్ గా ఈ మూవీ ఇప్పటివరకు 20కోట్ల రూపాయలు వసూలు చేసి, 25కోట్ల రూపాయల మార్క్ దిశగా దూసుకుపోతోంది. శర్వానంద్ కెరీర్ లో ఇదే హయ్యస్ట్ ఫిగర్ కాబోతోంది.

వరుసగా రెండు సంక్రాంతులకు హిట్స్ అందుకున్న హీరోగా శర్వానంద్ రికార్డు సృష్టించాడు. గతేడాది పొంగల్ కు ఎక్స్ ప్రెస్ రాజాతో, ఈ ఏడాది సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. సతీష్ వేగేశ్న డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ ఏడాది కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రంగా శతమానంభవతి పేరుతెచ్చుకుంది.