Thaman - వకీల్ సాబ్ సెకెండాఫ్ సస్పెన్స్

Tuesday,March 23,2021 - 02:32 by Z_CLU

వకీల్ సాబ్ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటపెట్టాడు తమన్. ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి బిహైండ్ ద స్క్రీన్ జరిగిన కొన్ని విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

వకీల్ సాబ్ సినిమాలో అసలు పాటలు పెట్టడానికి స్కోప్ లేదు. కానీ 4 సాంగ్స్ వచ్చాయి. వేణు శ్రీరామ్ ఆ విధంగా స్క్రీన్ ప్లే మార్చాడు

⇒ వకీల్ సాబ్ సినిమాకు ముందుగా మగువ అనే టైటిల్ అనుకున్నాం. ఆ టైటిల్ నుంచే పాట పుట్టింది. కానీ ఆ తర్వాత వకీల్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ అయింది

ఈ సినిమా సెకెండాఫ్ లో పెద్ద సస్పెన్స్ ఉంది. అదేంటనేది నేను అప్పుడే చెప్పను

సినిమా కోసం ముందు ఓ పాట కంపోజ్ చేశాను. ఎడిట్ సూట్ లో వకీల్ సాబ్ సినిమాలో పవన్ ను చూసిన తర్వాత నా సాంగ్ ను నేనే డిలీట్ చేశాను. మరో కొత్త సాంగ్ కంపోజ్ చేసి ఇచ్చాను. పవన్ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది.

Full Interview కోసం క్లిక్ చేయండి