సూపర్ స్టార్ ఫాన్స్ కి పండగే !

Sunday,August 13,2017 - 10:13 by Z_CLU

ప్రెజెంట్ ‘స్పైడర్’ షూటింగ్ ను క్లైమాక్స్ కి తీసుకొచ్చిన సూపర్ స్టార్ మహేష్ గ్యాప్ తీసుకోకుండా కొరటాల డైరెక్షన్ లో ‘భరత్ అనే నేను’ సినిమాను సెట్స్ పై పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఫాన్స్ కి ఓ సప్రయిజ్ ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో సూపర్ స్టార్ కృష్ణ కూడా మహేష్ తో కలిసి కనిపించనున్నాడనే వార్త ప్రెజెంట్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ఓ పొలిటికల్ పాత్రలో కనిపించనున్నాడనేది తెలిసిందే.  ఈ సినిమాలో ఓ ముఖ్య సందర్భంలో వచ్చే గెస్ట్ రోల్ కి ఇటీవలే కృష్ణ గారైతేనే బాగుంటుందని భావించి ఆయనని సంప్రదించారట. ఇందుకు కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని త్వరలోనే కృష్ణ -మహేష్ ల కాంబినేషన్ లో వచ్చే ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని టాక్.. మరి ఈ వార్త కనుక నిజమైతే చాలా ఏళ్ళ తర్వాత ఒకే స్క్రీన్ మీద ఇద్దరు సూపర్ స్టార్స్ ని చూసి ఫాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.