మెగాస్టార్ కి గురువుగా అమితాబ్ బచ్చన్

Tuesday,January 09,2018 - 12:44 by Z_CLU

మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో బిగిన్ కానుంది. చిరు రీ ఎంట్రీ తరవాత తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో హై ఎండ్ డిమాండ్ క్రియేట్ అయి ఉంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్రీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ గా కనిపిస్తున్నాడనే క్లారిటీ బిగినింగ్ నుండే ఉన్నా, అమితాబ్ బచ్చన్ ప్లే చేయనున్న క్యారెక్టర్ చుట్టూ రకరకాల స్పెక్యులేషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినిమా యూనిట్ నుండి ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, బిగ్ బి ఈ సినిమాలో చిరుకి గురువుగా నటిస్తున్నారనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

ఈ టాక్ ఎంత వరకు కన్ఫం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ మోడ్ లో ఉన్నా, ఈ సినిమాలో అమితాబ్ ప్రెజెన్స్ పెద్ద ఎసెట్ అవ్వడం ఖాయమని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ కంపోజర్ ని ఇంకా ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.