రానా కోసం ఆ ముగ్గురు

Saturday,January 28,2017 - 04:17 by Z_CLU

దగ్గుబాటి రానా త్వరలోనే ‘ఘాజీ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. విశాఖ నేపధ్యం లో యుద్ధ నౌకల ఆధారంగా తొలి ఇండియన్ సబ్ మెరైన్ ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ ముగ్గురు స్టార్ హీరోలు తమ వాయిస్ అందించబోతున్నారట.

big-b-chiru-surya-voice-over-for-ghazi
ఇప్పటికే ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు పెంచడం తో సినిమాను మరింత ప్రమోట్ చేసే పనిలో పడిన యూనిట్ తాజాగా ఈ సినిమా ప్రారంభం లో స్టార్ హీరో తో వాయిస్ ఓవర్ చెప్పించడానికి చూస్తున్నారట. బాలీవుడ్ లో అమితాబ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తుండగా తెలుగు లో రానా కోసం మెగా స్టార్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడట. ఇక తమిళ్ లో ఈ సినిమాకి సూర్య వాయిస్ అందించబోతున్నట్లు సమాచారం. మరి ఈ ముగ్గురు తమ వాయిస్ తో ఈ సినిమాను మూడు భాషల్లో ప్రమోట్ చేయడానికి ముందుకు రావడంతో సినిమా పై మరింత హైప్ పెరిగింది.