సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న భూమిక

Saturday,December 30,2017 - 10:03 by Z_CLU

MCA సినిమాలో నానికి వదినగా నటించి ఇంప్రెస్ చేసిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. మంచి స్టోరీస్ అందునా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితేనే సంతకం చేస్తానని తేల్చేసిన భూమిక, ఇపుడు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా మొదలు పెట్టేసింది.

నాగచైతన్య సవ్యసాచిలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్న భూమిక, చైతు కి అక్కలా కనిపించనుంది. సినిమాలో  కనిపించేది కాసేపే అయినా, స్టోరీలో హై ఎండ్ ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్ అని చెప్పుకున్న ఈ సీనియర్ హీరోయిన్, ఈ సినిమాలో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది.

చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.